![]() |
![]() |
.webp)
గత కొన్నిరోజులుగా ఈ ట్విస్ట్ కోసం ' ఎటో వెళ్ళిపోయింది మనసు' సీరియల్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సీరియల్ లో అభిని చూస్తే ప్రతీ ఒక్కరికి కోపం, ద్వేషం, బాధ, కలుగుతుంటాయి. ఎందుకంటే ఆ పాత్ర అలా ఉంది. ఈ సీరియల్ లో అసలు ఏం అయిందో ఓసారి చూద్దాం.
ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ప్రోమో రిలీజ్ అవుతే చాలు.. గంటలోపే వేలల్లో వ్యూస్ వస్తాయి. అంతలా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ లో రక్ష నింబార్గి, సీతాకాంత్ ల ఆన్ స్క్రీన్ పర్ఫామెన్స్ కి ఆడియన్స్ ఫిధా అయ్యారనే చెప్పాలి. రోజుకో ట్విస్ట్ తో సాగే ఈ సీరియల్ లో మాణిక్యం, సిరి, ధన, శ్రీలత, సందీప్, అభి, రామలక్ష్మి, సీతాకాంత్ ఇలా అందరు తమ పాత్రలకి న్యాయం చేస్తున్నారు. గత జన్మలో ప్రేమించుకొని విడిపోయిన రామలక్ష్మి, సీతాకాంత్.. ఈ జన్నలోనైనా కలుస్తారా లేదా అనే కథాంశంతో మొదలైన ఈ కథ.. మొదటి ఎపిసోడ్ నుండి ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అందులోను ఇద్దరి భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు.. అయితే రామలక్ష్మికి ముందుగానే అభి అనే బాయ్ ఫ్రెండ్ ఉండటంతో కథలో మెలిక మొదలైంది. అభి వాళ్ళింటికి సీతాకాంత్ వెళ్ళి అక్కడ అన్నీ విషయాలు తెలుసుకుంటాడు.
అభికి సీతాకాంత్ గుణపాఠం చెప్పి.. తను ఇచ్చిన అగ్రిమెంట్ పేపర్స్ ని తీసుకుంటాడు. ఇక రామలక్ష్మిని కలిసి తను చెప్పినట్టు చేయమంటాడు సీతాకాంత్. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో రామలక్ష్మిని అభి కలుస్తాడు. నువ్వు నాకు సెట్ అవ్వవు.. నా స్థాయికి నువ్వు సరిపోవు. ఏవిధంగాను నువ్వు నాకు మ్యాచ్ అవ్వవు అని రామలక్ష్మితో అభి అంటాడు. అభి నువ్వేనా ఇలా మాట్లాడేది? నీ స్థాయికి నేను మ్యాచ్ అవ్వనా అని రామలక్ష్మి ఎమోషనల్ గా అడుగుతుంది. అవును..అవును అని అభి అంటాడు. చిటికేస్తే కోట్లలో కట్నం ఇచ్చే అమ్మాయిలు రెడీగా ఉంటారు. వెతుక్కుంటూ వస్తున్న అదృష్టాన్ని కాలదన్నుకొని నీలాంటి దురదృష్టం దగ్గర ఆగిపోమంటావా అని రామలక్ష్మితో అభి అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్, రామలక్ష్మిని కలిసి.. అభి మాట్లాడంటే నేను నమ్మలేకపోతున్నాను.. పదా అభికి అలా మాట్లాడటం తప్పు అని చెప్తా అని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు. అలాంటివాడికి చెప్తే మారతాడని అనుకోవడమంత పిచ్చితనం మరొకటి ఉండదు సర్ అని రామలక్ష్మి అంటుంది. దాంతో సీతాకాంత్ ఆశ్చర్యంగా చూస్తాడు.
![]() |
![]() |